స్వల్పంగా పెరిగిన వంట గ్యాస్ ధరలు

వంట గ్యాస్ ధరలు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా పెరిగిన ధరలు జూలై 1నుంచి అమలులోకి రానున్నాయి. అయితే, పలు మెట్రో సిటీల్లో పలు రకాలుగా ధరలు పెరుగాయి. సబ్సీడీ లేని 14.2 కిలోల సిలిండర్ పై ఢిల్లీలో ఒక రూపాయి, ముంబైలో 3.50 రూపాయలు, చెన్నైలో 4 రూపాయలు, కోల్ కతాలో 4.50 రూపాయలు, హైదరాబాద్ లో 4.50 రూపాయల చొప్పున పెరిగింది. అయితే కొత్తగా ధరలు పెరిగిన తరువాత ఎల్పీజీ సిలిండర్ ధరలు హైదరాబాద్ లో 645.50 రూపాయలు, ఢిల్లీలో 594 రూపాయలు, కోల్‌కతాలో 620.50 రూపాయలు, ముంబైలో 594 రూపాయలు, చెన్నైలో 610.50రూపాయలుగా ఉన్నాయి. వరసగా రెండో నెల కూడా వంట గ్యాస్ ధరలు పెరిగాయి.

Recommended For You