మాతృభాషలో మాట్లాడలేదో ఇంక్రిమెంట్ కట్: సర్కార్ నిర్ణయం

మాతృభాషలో మాట్లాడకుండా మీకు నచ్చిన భాష మాట్లాడితే సామన్య ప్రజలకు ఎలా అర్థమవుతుంది. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలగురించి వాళ్లకి ఎలా తెలుస్తుంది. మాతృభాష మరాఠీపై నిర్లక్ష్యం తగదు. ఇప్పటికే చాలా సార్లు చెప్పినా మళ్లీ పునరావృతమవుతూనే ఉంది. ఈసారి చర్యలు కఠినంగా ఉంటాయి. మరాఠీ మాట్లాడకపోతే వారి సర్వీస్ బుక్ లో నెగెటివ్ మార్క్ వేయడంతో పాటు, వార్షిక ఇంక్రిమెంట్ ను నిలిపివేస్తాం అని ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వ అధికారులను హెచ్చరించారు. ఇకపై అన్ని అధికారిక కార్యకలాపాల్లో మరాఠి వాడుకను తప్పనిసరి చేస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేసింది మహా సర్కారు. మరాఠీని ఉపయోగిస్తే ప్రజలు బాగా అర్థం చేసుకుని ప్రయోజనం పొందుతారని తెలిపింది.

Recommended For You