18 ఆస్పత్రులు తిరిగినా ఎవరూ జాయిన్ చేసుకోలేదు.. చివరకు..

మహమ్మారి కరోనా మనిషిని మరీ ఇంత ఇబ్బంది పెడుతుందా.. ఊపిరి ఆగిపోతుందన్నా ఎవరూ జాయిన్ చేసుకోలేదు.. ప్రాణం పోతోందని ప్రార్థించినా ఒక్కరూ కనికరించలేదు.. 18 ఆస్పత్రులు తిరిగీ తిరిగీ ప్రాణం అలసి పోయింది.. చివరికి ఒక ఆస్పత్రి వారు కనికరించి జాయిన్ చేసుకున్నా చికిత్స ప్రారంభించిన కొద్ది సేపటికే ప్రాణం పోయింది. ఈ విషాద సంఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటు చేసుకుంది. సకాలంలో వైద్యం అందితే బతికే వాడని బంధువులు ఆరోపిస్తున్నారు. చివరకు ఒక ఆస్పత్రిలో వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించినా ఉపయోగం లేకుండా పోయిందని రోదిస్తున్నారు. మృతుడికి కరోనా ఉందా లేదా అనేది ఇంకా నిర్ధారణ కాలేదు.

Recommended For You