కరోనా వ్యాక్సిన్ పంపిణీ గురించి మోదీ అధ్యక్షతన సమావేశం

ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తుంది. దీంతో యావత్ ప్రపంచం కరోనా మెడిసిన్ కోసం ఎదురుచూస్తోంది. అయితే, కరోనా టీకా త్వరలో మార్కెట్ లోకి రానుంది. జంతువులపై పరీక్షలు జరిగి మంచి ఫలితాలు రావటంతో.. ప్రస్తుతం మనుషులపై ట్రైల్స్ చేయడానికి సిద్ధం అవుతోంది. దీంతో ప్రధాని మోదీ అధ్యక్షతన మంగళవారం జరిగిన సమావేశంలో.. టీకాలు ముందుగా ఎవరికి అందించాలి అనే దానిపై చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో ముందుగా పేదలకు, బడుగు బలహీన వర్గాలకు, ఎక్కవ రిస్క్ లో ఉన్నవారికి ముందుగా టీకా అందించాలని నిర్ణయించారు. వ్యాక్సిన్ అందించే విషయంపై మోదీ సమావేశంలో విస్తృత చర్చ జరిగింది. టీకా తయారీ కేంద్రాలను నిరంతరం పర్యవేక్షించేందుకు రియల్ టైం మానిటరింగ్ విధానం కూడా అవలంబిస్తుందని సమాచారం. వ్యాక్సిన్‌ను తక్కువ ధరకు, అందరికీ అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది.

Recommended For You