నిబంధనలు కఠినంగా ఉండాలి.. చట్టానికి ఎవరూ అతీతులు కారు: మోదీ

నిబంధనలు కఠినంగా ఉండాలి.. చట్టానికి ఎవరూ అతీతులు కారు: మోదీ

సరైన సమయంలో లాక్డౌన్ విధించి లక్షలాది మంది ప్రాణాలు కాపాడామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జాతి నుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని.. కరోనాతో పోరాటం చేస్తూ అన్ లాక్ 2.0లోకి ప్రవేశించామని అన్నారు. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలని అన్నారు. ప్రస్తుత సమయంలో జలుబు, జ్వరం వంటి వ్యాధులు చుట్టుముడతాయి. వాటిని అశ్రద్ధ చేయొద్దు. జాగ్రత్తలు పాటించాలి. కరోనా కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో కంటైన్మెంట్ జోన్లపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కొవిడ్ నిబంధనలు పాటించకపోతే జరిమానా విధించాలి. మాస్క్ ధరించనందుకు ఒక దేశ ప్రధానికి రూ.13 వేలు జరిమాన విధించిన విషయాన్ని గుర్తు చేశారు. దేశంలో ఏఒక్కరూ చట్టానికి అతీతులు కారని మోదీ అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story