జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్..

రిలయన్స్ జియో కొత్త పథకాలతో వినియోగదారులను ఆకర్షిస్తోంది. తాజాగా ఫెయిర్ యూసేజ్ పాలసీ లిమిట్ కింద కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా జియో నుండి ఇతర నెట్ వర్క్ లకు 12000 నిమిషాల టాక్ టైం అందిస్తోంది. పరిమితి అయిపోయాక మాత్రం ప్రతి కాల్ పై 6 పైసల ఐయూసీ చార్జీలను వసూలు చేయనుంది. ప్రీపెయిడ్ ప్లాన్స్ ఒకసారి చూద్దాం..

రూ.2599 ప్రీ పెయిడ్ ప్లాన్: ఇది వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్. ఇతర నెట్ వర్క్ లకు 12వేల నిమిషాల టాక్ టైం లభ్యం. రోజుకు 2 జీబీ డేటాతో పాటు 10 జీబీ డేటా బోనస్ అదనంగా అందిస్తుంది. అంటే సంవత్సరానికి మొత్తం 740 జీబీ డేటీను వాడుకోవచ్చు. రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్ లు. అలాగే డిస్నీ, హాట్ స్టార్ వార్షిక చందా ఉచితం.
రూ.2399 ప్రీ పెయిడ్ ప్లాన్: ఇది కూడా వార్షిక చందానే. నాన్ జియో ఎఫ్ యూపీ 12 వేల నిమిషాలు. రోజుకు 2 జీబీ డేటా, రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్ లు లభ్యం. అయితే ఈ ప్లాన్ లో 10 జీబీ అదనపు డేటా లేదా డిస్నీ, హాట్ స్టార్ కు సభ్యత్వం లభించదు.
రూ.2121 ప్రీ పెయిడ్ ప్లాన్: 336 రోజుల వాలిడిటీ, నాన్ జియో ఎఫ్ యూపీ 12 వేల నిమిషాల టాక్ టేం అందిస్తుంది. రోజుకి 1.5 జీబీ డేటా, ఎస్ఎంఎస్ లు లభ్యం.
రూ.1299 ప్రీ పెయిడ్ ప్లాన్: ఈ ప్లాన్ కూడా 336 రోజుల చెల్లుబాటులో ఉంటుంది. ఇతర నెట్ వర్క్ లకు 12 వేల నిమిషాల టాక్ టైం లభ్యం. ఈ ప్లాన్ లో 24 జీబీ డేటా, జియో టు జియో అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్ లు.
రూ.4999 ప్రీ పెయిడ్ ప్లాన్: ఈ ప్లాన్ లో రోజువారీ డేటా పరిమితి లేకుండా 350 జీబీ అపరిమిత డేటాను తెస్తుంది. ఇతర నెట్ వర్క్ లకు 12 వేల నిమిషాల టాక్ టైం అందిస్తుంది. 100 ఉచిత ఎస్ఎంఎస్ లు.

Recommended For You