ఫేస్‌బుక్‌కు వరుస దెబ్బలు.. మైక్రోసాఫ్ట్ కూడా..

ఫేస్‌బుక్‌కు వరుస దెబ్బలు.. మైక్రోసాఫ్ట్ కూడా..

ఫేస్‌బుక్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా బహుళజాతి కంపెనీలు అన్నీ.. ఫేస్‌బుక్‌ను బాయ్‌కాట్ చేస్తున్నాయి. జాతి, లింగ వివక్షపూరిత పోస్టులకు వేదిగా ఫేస్‌బుక్ మారుతోందని ఆరోపిస్తూ.. ప్రకటనలు ఇవ్వకూడదని నిర్ణయించుకుంటున్నాయి. తాజా ఇదే జాబితాలోకి టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కూడా చేరింది. ద్వేష పూరిత పోస్టులు ఉండే దగ్గర తన ప్రకటనలు ఉండకూడదని ఈ సంస్థ భావించింది. దీంతో ఫేస్‌బుక్, ఇన్‌స్టాలకు యాడ్‌లను ఇవ్వకూడదని నిర్ణయించింది. మే నెల నుంచే ప్రకటనలు నిలిపివేసినా.. ఈ నిషేధాన్ని మరిన్ని ఆగస్టు వరకూ పొడిగించింది. మైక్రోసాఫ్ట్ తీసుకున్న ఈ నిర్ణయం ఫేస్‌బుక్ కు భారీ నష్ట్రాన్ని చేకూరుస్తుంది. గత ఏడాది మైక్రోసాఫ్ట్ 115 మిలియన్ డాలర్ల ప్రకటనల ఇచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story