అందరికీ అందుబాటు ధరలో వ్యాక్సిన్..

వ్యాక్సిన్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నాయి ప్రపంచ దేశాలన్నీ. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ వ్యాక్సిన్ పై ఆశలు చిగురింప జేస్తోంది. ఈ ఏడాది అక్టోబర్ నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకు వచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నామని తెలిపింది. చివరి దశ ట్రయల్స్ మాత్రమే మిగిలి ఉన్నాయని తెలిపింది. కాగా వ్యాక్సిన్ వచ్చిన అనంతరం ముందుగా వైరస్ ముప్పు పొంచి వున్న ప్రజలకు, వైద్య సిబ్బంది ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం జరిగిన సమావేశంలో నిర్ణయించారు. అందుబాటు ధరలో ఉండేలా కార్యాచరణ చేపట్టాలని సమావేశంలో చర్చించారు. వ్యాక్సిన్ తయారీ, ఉత్పత్తి సామర్ధ్యాలపై రియల్ టైం పర్యవేక్షణ ఉండాలని సమావేశంలో నిర్ణయించారు. వివిధ ఏజెన్సీలు, ప్రైవేట్ రంగం, పౌర సమాజం మధ్య సమన్వయం వంటి నాలుగు సూత్రాల ఆధారంగా వ్యాక్సిన్ పంపిణీ నిర్ణయం తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు.

Recommended For You