తెలుగు సీరియల్ యాక్టర్ కి కరోనా..

ఎన్ని రోజులు ఇంట్లో కూర్చుంటాం అని లాక్డౌన్ అనంతరం జాగ్రత్తలతో షూటింగ్ లు ప్రారంభిచారు బుల్లితెర సీరియల్స్ యాజమాన్యం. అయినా ఇద్దరికీ కరోనా వచ్చి కలకలం రేపింది. తాజాగా మరో టీవీ నటి నవ్య స్వామికి కరోనా అని తేలింది. మా టీవీలో ప్రసార మవుతున్న ఆమెకథ సీరియల్ లో నవ్య హీరోయిన్. గత నాలుగు రోజులుగా తలనొప్పితో బాధపడుతున్న ఆమె కరోనా టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ అని తేలింది. దాంతో వైద్యుల పర్యవేక్షలో చికిత్స తీసుకుంటూ క్వారంటైన్ లో ఉన్నారు. రెండు వారాల నుంచి నవ్య షూటింగ్స్ లో పాల్గొంటున్నారు.

తనకు కరోనా వచ్చిన విషయం గురించి మాట్లాడుతూ.. రాత్రి నుంచి ఏడుస్తూనే ఉన్నాను. నన్ను చూసి అమ్మ కూడా ఏడుస్తోంది. నాకు కరోనా వచ్చిందని తెలిసి అందరూ ఫోన్లు చేస్తున్నారు. చాలా మందితో మాట్లాడాను. వాట్సాప్ లో మెసేజ్ లు వస్తూనే ఉన్నాయి. నాతోపాటు పని చేసిన వారందరినీ ఇబ్బంది పెట్టినందుకు బాధపడుతున్నాను. ఈ సమయంలో శారీరకంగా కన్నా మానసికంగా ఎక్కువ బలంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాను. నవ్యతో షూటింగ్స్ లో పాల్గొన్న వారందరికి కరోనా టెస్ట్ చేశారు. ప్రస్తుతం వారంతా హోం క్వారంటైన్ లో ఉన్నారు.

Recommended For You