ముంబై తాజ్ హోటల్‌కు ఉగ్ర బెదిరింపులు.. భారీ భద్రత

ముంబైలోని తాజ్ మహల్ ప్యాలెస్, తాజ్ ల్యాండ్స్ ఎండ్ హోటళ్ల వద్ద అధికారులు భద్రత కట్టుదిట్టం చేశారు. 26/11 తరహా దాడులు చేస్తామని ఉగ్రవాదుల నుంచి ఈ రెండు హోటళ్లకు బెదిరింపు కాల్స్ రావటంతో ఈ మేరకు భద్రత పెంచారు. కరోనా కారణంతో పూర్తిగా మూతపడిన ఈ రెండు హోటళ్లూ.. అన్ లాక్ మొదలైనప్పటి నుంచి కొద్ది పాటి సేవలు అందిస్తున్నాయి. అయితే, సోమవారం రెండు హోటళ్లకు పాకిస్తానీ నెంబర్లు నుంచి కాల్స్ వచ్చాయని.. కాల్ చేసిన వారు తాము కరాచి నుంచి మాట్లాతున్నానని.. లస్కరే తోయిబాకి చెందిన వాడనని చెప్పి.. 26/11 తరహా దాడులు చేస్తామని చెప్పారని హోటల్ యాజమాన్యం చెబుతోంది. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు అసలు ఈ కాల్స్ ఎక్కడ నుంచి వచ్చాయో అని ఆరా తీసే పనిలో పడ్డారు.

Recommended For You