కిక్కుకోసం శానిటైజర్‌ తాగి ఇద్దరు మహిళలతో పాటు ఓ వ్యక్తి మృతి

కిక్కు కోసం శానిటైజర్ తాగి ముగ్గురు మృతి చెందారు. వీరిలో ఇద్దరు మహిళలు ఉండటంతో వారి బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. తిరుచానూరులో చోటుచేసుకున్న ఈ ఘటన చర్చనీయాంశమైంది.

తిరుపతికి చెందిన కొంతమంది చుట్టుపక్కల గ్రామాల్లో ప్లాస్టిక్‌, చిత్తుకాగితాలు సేకరించి.. దుకాణంలో విక్రయిస్తూ ఆ పరిసరాల్లోనే సంచరిస్తూ ఉంటారు. అయితే ఇటీవల లిక్కర్‌ ధరలు విపరీతంగా పెరిగింది. అయితే కరోనా నుంచి రక్షణ కల్పించే శానిటైజర్‌ సీసాలు విరివిగా లభిస్తుండడంతో వీరు మత్తుకోసం శానిటైజర్‌ తాగడం అలవాటు చేసుకున్నారు.

ఈ నేపథ్యంలో మద్యానికి బానిసలైన చిత్తుకాగితాలు ఏరుకునే ఇద్దరు మహిళలు, ఓ పురుషుడు తక్కువ ధరకు లభించే హ్యాండ్‌ శానిటైజర్‌ ద్రావణం అతిగా సేవించి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాఫ్తు చేపట్టారు.

Recommended For You