భారత్ తాజా నిర్ణయంతో టిక్‌టాక్ మాతృసంస్థకు భారీ నష్టం

భారత్ తాజా నిర్ణయంతో టిక్‌టాక్ మాతృసంస్థకు భారీ నష్టం

తాజాగా భారత్ తీసుకున్న నిర్ణయం టిక్ టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్ కు భారీ నష్టాన్ని మిగిల్చింది. చైనా యాప్స్ ను నిషేదిస్తూ భారత్ తీసుకున్న నిర్ణయంతో ఈ సంస్థ భవిష్యత్ పై రచించుకున్న వ్యూహాలు అన్నీ బుగ్గిపాలు అయినట్టేనని నిపుణులు అంటున్నారు. భారత్ లో దాదాపు 7500 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టడానికి ఈ సంస్థ సిద్దమైంది. దీనికి అనుగుణంగా సీనియర్ స్థాయిలో చాలా మంది భారతీయులను నియమించుకుంది. అయితే, భారత్ తీసుకున్న తాజా నిర్ణయాలతో వారి ఆసలు అన్ని అడియాశలు అయ్యాయి. భారత్ లోని టిక్ టాక్ హెడ్ తాజా పరిస్థితులపై స్పందించారు. సమాచార భద్రత, గోప్యతపై తాము అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నామని.. భారతీయుల సమాచారం చైనాకు కానీ.. మరే ఇతర దేశాలకు కానీ చేరే అవకాశం లేదని అన్నారు. ఇక గాల్వాన్ లోయలో జరిగిన వివాదం వలన భారత్ ఈ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, అధికారిక వర్గాలు మాత్రం ఈ రకమైన కారణాలను చెప్పకుండా.. భారతీయుల వ్యక్తిగత సమాచారానికి భంగం కలిగే ప్రమాదం ఉందని.. అందుకే చైనా యాప్స్ బ్యాన్ చేశామని తెలుపుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story