అలా ఎలా చేశాడు.. అస్సలు అర్థం కావట్లేదు: వీడియో వైరల్

అలా ఎలా చేశాడు.. అస్సలు అర్థం కావట్లేదు: వీడియో వైరల్

అతడి చేతిలో ఏదో మహిమ ఉంది.. అందుకే అలా నీళ్లు కింద పడకుండా తిప్పేస్తున్నాడు అనుకోవడం ఖాయం ఈ వీడియో చూస్తే.. గ్లాసు నిండా నీళ్లు పడితే ఒక్క చుక్క అయినా కింద పడకుండా నాలుగు అడుగులు వేయడం సాధ్యం కాదు. మరి అలాంటిది రెండు గ్లాసుల్లో నీళ్లు పోసి గిరా గిరా తిప్పేసి హ్యాపీగా మన కళ్ల ముందే తాగేశాడు.. ఇదేం మాయాజాలం.. ప్రముఖ సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్థ ఫిజిక్స్ అండ్ ఆస్టానమిజోన్ ఈ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేసింది. ఈ వీడియో భౌతిక శాస్త్రం గొప్పతనాన్ని చూపిస్తోంది అని క్యాప్షన్ కూడా జత చేసంది.

వీడియోలోని వ్యక్తి రెండు గ్లాసుల్లో నీళ్లు పోసి వాటికి సమాంతరంగా రెండు తాళ్లను కట్టి పెండ్యులమ్ ఆకారంలో తిప్పడం మొదలు పెట్టాడు. తరువాత ఇంకొంచెం స్పీడు పెంచి సర్కిల్ ఆకారంలో గిరా గిరా తిప్పడం మొదలు పెట్టాడు. అయినా గ్లాసుల్లో నీళ్లు ఒక్క చుక్క కూడా కింద పడలేదు. అంతా అయిపోయింతరువాత ఎంచక్కా గ్లాసులో నీళ్లు తాగేసి బై చెప్పేస్తాడు. అయితే ఆ వ్యక్తి చేసింది మ్యాజిక్ అనుకుంటారు కానీ కానే కాదు అది భౌతిక శాస్త్రంలోని న్యూటన్ ఫస్ట్ లా (లా ఆఫ్ ఇనర్షియా) జడత్వం, సెంట్రీపిటల్ ఫోర్స్ ను ఆధారంగా చేసుకుని ఇలా చేశాడంటూ ఫిజిక్స్ అండ్ ఆస్టానమీ పేర్కొంది. ఈ వీడియోను ఇప్పటివరకు 1.7 మిలియన్ మంది వీక్షించారు. అయితే ఎక్కడ తీశారనేది తెలియాల్సి ఉంది. చెన్నైలో తీసి ఉండవచ్చిని ఓ నెటిజన్ అభిప్రాయపడుతున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story