విశ్వనట చక్రవర్తిగా ఎస్వీఆర్ అభిమానుల గుండెల్లో ముద్ర వేసుకున్నారు: చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు ఎస్వీ రంగారావుకు నివాళులు అర్పించారు. ఈ మేరకు ఆయన ట్వీట్టర్ ద్వారా నివాళి అర్పించారు. వైవిధ్యమైన పాత్రల్లో ప్రక్షకులను అలరించి, విలక్షణమైన నటనతో విశ్వనట చక్రవర్తిగా అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న సామర్ల వెంకట రంగారావు(ఎస్వీఆర్) గారి జయంతి సందర్భంగా ఆ తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డ, యశస్వి ఎస్వీఆర్ గారి స్మృతికి నివాళులర్పిస్తున్నాను అని ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా.. ఎస్వీ రంగారావు జులై 3న 1918లో జన్మించారు. తెలుగు పరిశ్రమలో పలు పాత్రను వేసి ప్రేక్షకులను అలరించారు.

Recommended For You