మమ్మల్ని విస్తరణవాదులుగా చిత్రీకరించడం సరికాదు: చైనా

లద్దాఖ్ పర్యటనలో ప్రసంగించిన ప్రధాని మోదీ వ్యాఖ్యలపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. తమది విస్తరణవాదం కాదని చైనా రాయబార కార్యాలయ అధికార ప్రతినిధి జి రోంగ్ తెలిపారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ విస్తరణవాద శకం ముగిసిందని.. అభివృద్ధి వాద యుగం ప్రారంభమైందని అనటం సరికాదని అన్నారు. తమది విస్తరణ వాదంకాదని.. తమతో సరిహద్దుగా ఉన్న 14 దేశాల్లో 12 దేశాలతో చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకున్నామని తెలిపారు. స్నేహ సంబంధాల ద్వారా చాలా సమస్యలు పరిష్కరించుకున్నామని అన్నారు. తమది విస్తరణవాదంగా చిత్రీకరించడం తగదంటూ ట్వీట్ చేశారు.

Recommended For You