మహారాష్ట్రలో 2 ల‌క్ష‌ల‌కు చేరువ‌లో క‌రోనా పాజిటివ్ కేసులు

మహారాష్ట్రలో కరోనా కలకలం సృష్టిస్తోంది. రోజు రోజుకీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. రాష్ట్రవ్యాప్తంగా వైర‌స్ వేగంగా వ్యాప్తి చెందుతుండ‌టంతో.. ప్ర‌జ‌లు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు.

శుక్ర‌వారం ఒక్క‌రోజే కొత్త‌గా 6,364 పాజిటివ్ కేసులు న‌మోదయ్యాయి. మహారాష్ట్ర ‌వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 1,92,990 పాజిటివ్ కేసులు న‌మోదయ్యాయి. కరోనా మహమ్మారి బారిన పడి 198 ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనా బారిన పడి 8,376 మంది ప్రాణాలు కోల్పోయిన‌ట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది.

Recommended For You