త‌మిళనాడులో ల‌క్ష దాటిన క‌రోనా పాజిటివ్ కేసులు

త‌మిళ‌నాడులో క‌రోనా కలకలం సృష్టిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. ప్ర‌తిరోజు వేల సంఖ్య‌లో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. శుక్ర‌వారం ఒక్కరోజే 4,329 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో తమిళనాడు రాష్ట్రంలో న‌మోదైన మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య ల‌క్ష మార్కును దాటింది.

రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం పాజిటివ్ కేసుల సంఖ్య 1,02,721కి చేరింది. ఇక క‌రోనా మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. శుక్ర‌వారం కరోనా కారణంగా 64 మంది మృతి చెందారు. దీంతో మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 1,385కు చేరినట్లు తమిళ‌నాడు ఆరోగ్య శాఖ అధికారులు వెల్ల‌డించారు.

Recommended For You