నీట్‌, జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు వాయిదా

జేఈఈ మెయిన్స్‌, నీట్‌ పరీక్షలను కేంద్ర సర్కార్ వాయిదా వేసింది. దేశంలో కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో జేఈఈ మెయిన్స్‌, నీట్‌ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. చాలా విద్యాసంస్థలు క్వారెంటైన్ సెంటర్లుగా మారిన నేపథ్యంలో విద్యార్థులు పరీక్షలు రాసే పరిస్థితి కనిపించడం లేదని కేంద్రం తెలిపింది.

ఈ కరోనా నేపథ్యంలో నీట్‌ పరీక్షను సెప్టెంబర్‌ 13కి వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. ఇక జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు సెప్టెంబర్‌ 1 నుంచి 6 వరకు నిర్వహించనున్నట్లు అధికారులు చెప్పారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలు సెప్టెంబర్‌ 27న నిర్వహించనున్నారు.

Recommended For You