హార్డ్‌వేర్ షాపులో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం

హార్డ్‌వేర్ షాపులో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం

జార్ఖండ్ లోని హార్డ్‌వేర్ షాపులో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ సంఘటన బెర్మో సబ్ డివిజన్‌ గాంధీనగర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని జారిదిహ్ మార్కెట్లో జరిగింది. కాంప్లెక్స్ మూడో అంతస్థులో మధ్యాన్నం సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మంటల ధాటికి షాపులోని వస్తువులు కాలి బూడిద అయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజన్లతో అక్కడికి చేరుకుని మంటలు అదుపు చేశారు.

అయితే అప్పటికే దుకాణంలోని వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని పోలీసులు భావిస్తున్నారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది. మంటలు సంభవించిన వెంటనే స్థానిక జనం అక్కడికి చేరుకున్నారు. హార్డ్‌వేర్ షాపు యజమానికి సుమారు 20-25 లక్షల రూపాయల ఆస్తినష్టం జరిగినట్టు భావిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story