ఢిల్లీలో ల‌క్ష దాటిన క‌రోనా కేసులు

దేశ రాజ‌ధాని ఢిల్లీలో క‌రోనా వైర‌స్ కలకలం సృష్టిస్తోంది. రోజు రోజుకీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఢిల్లీ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఢిల్లీలో పాజిటివ్ కేసుల సంఖ్య ల‌క్ష దాటింది.

సోమ‌వారం సాయంత్రం నాటికి పాజిటివ్ కేసుల సంఖ్య 1,00,823కు చేరింది. గ‌డిచిన 24 గంట‌ల్లో 1,379 మందికి పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. కరోనా బారిన పడి ఒక్కరోజే 48 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 3,115కు చేరింది. సోమ‌వారం ఒక్క‌రోజే క‌రోనా నుంచి 749 మంది కోలుకున్నారు. కరోనా బారిన పడి ఇప్ప‌టి వ‌ర‌కు 72,088 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు.

Recommended For You