భారత్‌లోని ఆ ప్రాంతంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు!

దేశంలో కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. దీంతో కరోనా వైరస్ కారణంగా తీవ్రంగా ప్రభావితమైన మూడో దేశంగా భారత్ నిలిచింది. ఇప్పటికే 7లక్షల వరకు కరోనా బాధితులను దేశవ్యాప్తంగా గుర్తించారు. అయతే దేశంలోని ఓ ప్రాంతంలో మాత్రం ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్‌లో ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా అధికారికంగా నమోదు కాలేదు.

దీని కారణం లక్షద్వీప్‌లో పాటిస్తున్న కఠిన నిబంధనలు. ఈ విషయాన్ని కవరత్తి అదనపు కలెక్టర్ వివరించారు. లక్షద్వీప్‌కు చెందిన స్థానికులను మాత్రమే ఇతర ప్రాంతాల నుంచి వచ్చేందుకు అనుమతిస్తున్నట్లు కవరత్తి అదనపు కలెక్టర్ తెలిపారు . అది కూడా కరోనా నెగెటివ్‌గా తేలిన వారిని మాత్రమే అనుమతిస్తున్నట్లు తెలిపారు.

Recommended For You