యూపీలో ఒక్కరోజే కరోనాతో 20 మంది మృతి

ఉత్తర్‌ప్రదేశ్‌లో కరోనా విజృంభిస్తున్నది. రోజు రోజుకు వందల సంఖ్యలో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా అంతకంతకు పెరుగుతోంది. యూపీ రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ఒక్కరోజే 933 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. కరోనా మహమ్మారి బారిన పడి ఒక్కరోజే 20 మంది మృతి చెందినట్లు ఆ రాష్ట్ర అడిషనల్‌ చీఫ్‌ సెక్రెటరీ అవనీష్‌ అవాస్తి తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 19,109 మంది వైరస్‌ నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. కరోనా కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 809 మంది మృతి చెందారు.

Recommended For You