కొడుకు మృతి.. కోడ‌లిని పెళ్లి చేసుకున్న మామ

కొడుకు మృతి.. కోడ‌లిని పెళ్లి చేసుకున్న మామ

కొడుకు చ‌నిపోయి వితంతువుగా మారిన కోడ‌లిని మామ పెళ్లి చేసుకున్నాడు. రెండేళ్ళ క్రితం కొడుకు చనిపోయాడు. అప్పటినుంచి మనో వేదనను భరిస్తున్న కోడలి బాధను చూడలేకపోయాడు మామ. దీంతో కోడలిని పెళ్లి చేసుకున్నాడు. ఈ వింత ఘటన ఛత్తీస్‌గఢ్‌లో చోటు చేసుకుంది.

బిలాస్‌పూర్‌కు చెందిన గౌతమ్ సింగ్‌కు కొన్ని సంవత్సరాల క్రితం 22 ఏళ్ల ఆర్తి సింగ్‌తో వివాహాం జరిగింది. రెండేళ్ల క్రితం గౌతమ్ సింగ్ మృతి చెందాడు. దీంతో ఆర్తిసింగ్ రెండు సంవత్సరాల నుంచి భర్త లేని ఒంటరి తనంతో తన బాధ ఎవరికి చెప్పుకోలేక పలు ఇబ్బందులు ఎదుర్కొంటోంది. భర్త చనిపోయిన దగ్గర నుంచి ఆర్తి సింగ్ అత్త‌గారింట్లోనే ఉంటుంది.

రాజ్‌పుత్‌ వంశంలో స్త్రీలు పెద్దగా బయటకు రారు. దీంతో భ‌ర్త మ‌ర‌ణించిన‌ప్ప‌టి నుంచి ఆర్తిసింగ్ ఇంట్లోనే ఉండిపోయింది. అయితే రాజ్‌పుత్ క్షత్రియ మహాసభ సంప్రదాయం ప్రకారం.. మహిళలు పునర్ వివాహం చేయ‌వ‌చ్చు. ఇదే విషయాన్ని ఆర్తి సింగ్ మామ కృష్ణా రాజపుత్ సింగ్ క్షత్రియ మహాసభ ముందుకు తీసుకొచ్చారు.

ఈ నేపథ్యంలో గౌతమ్ సింగ్ తండ్రి కృష్ణ రాజ్‌పుత్‌ను ఆర్తిసింగ్ వివాహం చేసుకోవాలని ప్రతిపాదించారు. దీంతో క్ష‌త్రియ మ‌హాస‌భ స‌భ్యులు.. ఆర్తిసింగ్ అభిప్రాయం అడిగారు. రెండేళ్లుగా మామ తనను చూసుకుంటున్న తీరు నచ్చిన ఆర్తిసింగ్ కూడా మామను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. దీంతో క్షత్రియ సంప్రదాయం ప్రకారం.. ఆ సంఘం ప్రతినిధులు కరోనా వైరస్ నేపథ్యంలో పరిమిత సంఖ్యలో అతిథులను ఆహ్వానించి కోడలితో మామ వివాహం జరిపించారు. ఈ విష‌యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Tags

Read MoreRead Less
Next Story