జూలై 8 నుండి హోటళ్ళు, లాడ్జీలు తెరుచుకోవచ్చు..

జూలై 8 నుండి హోటళ్ళు, లాడ్జీలు తెరుచుకోవచ్చు..

రోజూ అక్కడ వేలాదిగా కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. దేశంలో అత్యంత ఎక్కువగా కరోనాకు ప్రభావితం అయిన రాష్ట్రంగా మహారాష్ట్రకు గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో జూలై 8 నుండి కంటైనేషన్ జోన్ వెలుపల హోటళ్ళు, లాడ్జీలు ,అతిథి గృహాలను తెరవడానికి మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతులిచ్చింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సోమవారం మార్గదర్శకాలు జారీ చేసింది.

జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం, హోటళ్ళు, లాడ్జీలు ,అతిథి గృహాలు ప్రస్తుతం వాటి సామర్థ్యంలో 33% మాత్రమే బుక్ చేసుకోవడానికి అనుమతించారు. కరోనా సంక్రమణకు సంబంధించిన ప్రతి సమాచారాన్ని హోటల్ వెలుపల , లోపల పోస్టర్లు , బ్యానర్‌ల ద్వారా ప్రదర్శించాల్సి ఉంటుంది. అతిథి ప్రవేశించే ముందు థర్మల్ స్క్రీనింగ్ చేయించుకోవాలి. లక్షణాలు లేని వ్యక్తులు మాత్రమే అనుమతించాలి. అంతేకాకుండా మాస్కులు ధరించడం తప్పనిసరి అని పేర్కొంది.

Tags

Read MoreRead Less
Next Story