పుల్వామాలో భద్రతా దళాల చేతిలో మరో ఉగ్రవాది హతం

జమ్మూ కాశ్మీర్ పుల్వామా జిల్లాలోని గుసు ప్రాంతంలో భద్రతా దళాలు మరొక ఉగ్రవాదిని హతమార్చాయి. గుసు లో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు, సైనికులు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఈ సమయంలో ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు, దీంతో ఇద్దరు సైనికులను గాయపడ్డారు.

ఈ క్రమంలో ఆ ఉగ్రవాది ఓ ఇంట్లో దాక్కున్నాడు. దాంతో ఎన్ కౌంటర్ చేయడంతో ఆ ఉగ్రవాది హతమయ్యాడు. ఈ నెలలో ఇది మూడవ ఎన్‌కౌంటర్. అంతకుముందు జూలై 4 న కుల్గాంలోని అర్రా ప్రాంతంలో ఇద్దరు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులు హతమయ్యారు. జూలై 2 న శ్రీనగర్‌లోని మాల్‌బాగ్‌లో ఒక ఐఎస్ ఉగ్రవాదిని భద్రతా దళాలు ఎన్ కౌంటర్ చేశాయి.

Recommended For You