పరీక్షలు ఉంటాయి.. కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌

ఉన్నత విద్యా సంస్థల పరీక్షల నిర్వహణకు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సోమవారం పచ్చ జెండా ఊపింది. ఈ మేరకు పరీక్షల నిర్వహణకు అనుమతిస్తూ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శికి కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. దీంతో ప్రస్తుత పరిస్థితుల కారణంగా చివరి సంవత్సరం పరీక్షలు రద్దు చేస్తారనే ఊహాగానాలకు తెరపడినట్లయింది. అయితే యూనివర్సిటీ అఫ్ గ్రాంట్ కమిషన్ ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయనప్పటికీ, 2020 ఏప్రిల్ 29 న పరీక్షలపై జారీ చేసిన మార్గదర్శకాలలో మార్పులు ఉండవని వర్గాలు తెలిపాయి.

ఫైనల్ టెర్మ్ ఎగ్జామ్స్ తప్పనిసరిగా నిర్వహించాలని.. ఇందులో యూజీసీ మార్గదర్శకాలకు, ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిబంధనలకు లోబడి, కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పరీక్షలు నిర్వహించాలని కేంద్ర హోమ్ శాఖ సూచించింది. ఇదిలావుంటే కరోనా విజృంభణ కారణంతో పలు రాష్ట్రాలు యూజీ, పీజీ పరీక్షలను రద్దు చేశాయి. ఈ నేపథ్యంలో.. కేంద్రం నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.

Recommended For You