సింగపూర్ వరకు విమానంలో ఒక్కడే ప్రయాణికుడు

సింగపూర్ వరకు విమానంలో ఒక్కడే ప్రయాణికుడు

విమానంలో ఒక్కరే ప్రయాణిస్తే ఎలా ఉంటుంది.. ఆ కిక్కే వేరు. పెద్ద పెద్ద బిలిగెట్స్‌‌కే సోంతమైన ఇలాంటి జర్నీ సామాన్యులకు దక్కితే ఆ థ్రిల్లే వేరు. కేరళకు చెందిన ఓ వ్యక్తికి ఇలాంటి అనుభవం కలిగింది. ఫ్రాంక్‌ఫర్ట్ నుండి సింగపూర్‌కు సోలో ప్యాసింజర్‌గా ప్రయాణించాడు. ఈ సమయంలో విమానంలో 10 మంది సిబ్బంది ఉన్నారు. కరోనా మహమ్మారి కారణంగా ఈ మధ్య కాలంలో ప్రయాణికులకు విమానంలో ఇటువంటి వింత అనుభవాలు చోటు చేసుకుంటున్నాయి.

కేరళకు చెందిన ప్రతాప్ పిళ్ళై.. లాక్‌డౌన్ కావడానికి ముందే సింగపూర్ నుంచి జర్మనీలోని హాంబర్గ్ చేరుకున్నాడు. అనంతరం లాక్‌డౌ‌న్ కారణంగా మూడు నెలలు అక్కడే ఉండిపోయాడు. వందే భారత్ మిషన్ ఆధ్వర్యంలో జూన్ ఆరంభంలో పిళ్ళై భారతదేశానికి తిరిగి వచ్చే అవకాశం ఉంది. అయితే, వందే భారత్ మిషన్ విమానం ఢిల్లీకే ఉంది. దీంతో అతను సింగపూర్ మీదుగా కేరళకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి సింగపూర్ వెళ్లే విమానం టికెట్ బుక్ చేసుకున్నాడు.

అయితే ఈ విమానంలో సిబ్బంది మినహాయిస్తే ఈయన ఒక్కడే ప్రయాణికుడు. విమానంలో ఎక్కే ఏకైక ప్రయాణికుడు తానేనని విమానంలో ఎక్కిన తర్వాత తనకు తెలిసిందని పిళ్ళై తెలిపారు. ఇతర ప్రయాణికుల టిక్కెట్లు రద్దు కావడంతో తానొక్కడినే మిగిలిపోయానని అన్నారు. ఆ విమానంలో ఒంటరిగా ప్రయాణించి వింత అనుభవాన్ని సొంతం చేసుకొన్నట్లు తెలిపాడు.

Tags

Read MoreRead Less
Next Story