నేడు పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి..

ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు నిలకడగానే కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ధరల్లో మార్పు లేదు. హైదరాబాద్‌‌లో మంగళవారం లీటరు పెట్రోల్ ధర రూ.83.49 గత ఏడురోజులనుంచి అలాగే ఉంది. డీజిల్ ధర కూడా రూ.78.69 గానే కొనసాగుతోంది. అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానెకొనసాగుతోంది. అమరావతిలో లీటరు పెట్రోల్‌ ధర రూ.83.82 స్థిరంగానే ఉంది. డీజిల్‌ ధర కూడా రూ.78.98గానే కొనసాగుతోంది. ఇక విజయవాడలోనూ

గత ఏడురోజులనుంచి ఉన్న ధరలే ఉన్నాయి. ఇక్కడ పెట్రోల్ ధర రూ.83.43 గా ఉంది. డీజిల్ ధర కూడా రూ.78.62 వద్ద నిలకడగానే కొనసాగుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. లీటరు పెట్రోల్ ధర రూ.80.43 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఇక డీజిల్ ధర కూడా రూ.80.53గానే ఉంది. దేశ ఆర్ధిక రాజధాని ముంబయిలో పెట్రోల్ ధర రూ.87.19 , డీజిల్ ధర కూడా రూ.78.83 స్థిరంగా కొనసాగుతోంది. ఇదిలావుంటే దేశీ ఇంధన ధరలు ఈరోజు కూడా స్థిరంగానే ఉన్నాయి.

Recommended For You