సుప్రీం కోర్టు రిజిస్ట్రీ పై పక్షపాత ఆరోపణలు..కొట్టివేసిన కోర్టు!

సుప్రీం కోర్టు రిజిస్ట్రీ పై పక్షపాత ఆరోపణలు..కొట్టివేసిన కోర్టు!

కేసుల జాబితాలో పక్షపాతం ప్రదర్శిస్తున్నారని ఆరోపిస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. పైగా పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది రిపల్ కాన్సుల్‌కు సర్వోన్నత న్యాయస్థానం 100 రూపాయల జరిమానా విధించింది. జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఎస్‌ఐ నజీర్ ధర్మాసనం ఈ పిటిషన్ లో ఎలాంటి ఆధారాలు లేవని అభిప్రాయపడింది. రిజిస్ట్రీ విభాగం, అధికారులు.. పిటిషనర్లు, న్యాయవాదుల కోసం పగలు రాత్రి తేడా లేకుండా పనిచేస్తున్నా ఇలాంటి పిటిషన్లు దాఖలు చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది.

వర్చువల్ కోర్టులు నడుస్తున్న ఈ సమయాల్లో కొందరు ప్రభావవంతమైన న్యాయవాదుల పిటిషన్లపై మాత్రమే రిజిస్ట్రీ విభాగం అధికారులను ప్రాధాన్యత ఇస్తున్నారని.. పెద్దగా ప్రభావం చూపని న్యాయవాదుల పిటిషన్లపై వివక్ష చూపుతున్నారని ఆరోపిస్తూ రిపల్ కాన్సుల్ పిల్ దాఖలు చేశారు. అయితే ఇందులో వాస్తవం లేదని.. ఈ ఆరోపణల్లో ఎలాంటి ఆధారం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. సాంకేతిక లోపాల కారణంగా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కాకుండా ధర్మాసనం ఫోన్ ద్వారా తన నిర్ణయాన్ని తెలియజేసింది. ఈ పిటిషన్ దాఖలు చేసినందుకు 100 రూపాయల జరిమానా విధించింది ధర్మాసనం.

Tags

Read MoreRead Less
Next Story