సీనియర్‌ నటి సుమలతకు కరోనా పాజిటివ్‌

దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ మహమ్మారి సామన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఎవరిని వదలటం లేదు. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కరోనా వైరస్‌ బారిన పడ్డారు. తాజాగా ప్రముఖ నటి, ఎంపీ సుమలతకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయగా.. రిపోర్టులో పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ప్రస్తుతం సుమలత హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు.

తెలుగు, తమిళ, కన్నడ, మళయాలం భాషల్లో పలు చిత్రాల్లో నటించారు సుమలత. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మాండ్యా లోక్‌సభ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. తన నియోజక వర్గంలోని ప్రజలకు పలుమార్లు సుమలత కరోనా పై అవగాహన కల్పించారు.

Recommended For You