తెలంగాణ సచివాలయం కూల్చివేత పనులు ప్రారంభం

తెలంగాణ సచివాలయం కూల్చివేత పనులు ప్రారంభం అయ్యాయి. హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అర్ధరాత్రి నుంచి కూల్చివేత పనులు మొదలుపెట్టారు. ముందుగా సి బ్లాక్ ను కూల్చుతున్నారు. దీంతో సెక్రెటేరియేట్ వైపు వెళ్లే దారుల్ని మూసివేశారు. సచివాలయ ప్రాంగణంలో మొత్తం 11 బ్లాక్స్ ఉన్నాయి. వీటిని ఇంప్లోషన్ విధానంతో పడగొడుతున్నారు. దీంతో 138 ఏళ్ళ సెక్రెటేరియేట్ చరిత్ర కాలగర్భంలో కలిసిపోనుంది.
ముఖ్యమంత్రి కార్యాలయం అయిన సమతా బ్లాక్ ఆరవ ఫ్లోర్ లో ఉంది. ఇటీవలే తెలంగాణకు అప్పగించిన ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం ఎల్, జె బ్లాక్ లు ఎనిమిదవ అంతస్థులో ఉన్నాయి. నార్త్ , సౌత్ , హెచ్ బ్లాక్ తెలంగాణ మంత్రుల కార్యాలయాల భవన సముదాయం డి బ్లాక్ మూడంస్థులలో ఉన్నాయి. వీటన్నింటిని కూల్చివేయనున్నారు అధికారులు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com