గార్డు కమాండర్‌ను హత్యచేసి ఆపై తుపాకీతో కాల్చుకున్న జవాన్

ఓ జవాన్.. గార్డు కమాండర్‌ను హత్య చేసి.. ఆపై తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన
జమ్మూకాశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో చోటుచేసుకుంది. కుల్గాం జిల్లా శాస్త్రా సీమా బాల్ (ఎస్‌ఎస్‌బి) లో బిఎస్ఎఫ్ జవాన్ సోమవారం సాయంత్రం గార్డు కమాండర్‌ను హత్య చేసి. ఆ తర్వాత సర్వీస్ రైఫిల్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

సాయంత్రం జిల్లా కోర్టు కాంప్లెక్స్‌లో ఈ సంఘటన జరిగిందని అధికారులు వార్తా సంస్థకు తెలిపారు. ఇక్కడే ఎస్‌ఎస్‌బి 8వ బెటాలియన్‌ను భద్రత కింద మోహరించారు. హత్యగావించిన కమాండర్ ASI హోదాలో ఉన్నారు. ఓ విషయంలో జవాన్, కమాండర్ మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయి. దాంతో గొడవ జరిగింది. ఇది ప్రాణాలు తీసే స్థాయికి చేరింది.

Recommended For You