విశాల్ అసలు రూపం బయటపెడుతుందట..

కోలీవుడ్, టాలీవుడ్‌లలో మాంచి క్రేజ్ ఉన్న హీరోలలో విశాల్ కూడా ఒకరు. పుట్టింది ఆంధ్రాలో అయినా తమిళ్ లో బాగా రానిస్తున్నాడు. తెలుగులో కూడా మంచి పేరు సంపాదించాడు. నాలుగేళ్ల కిందట విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పేరుతో కంపెనీ స్టార్ట్ చేసి సినిమాలు తీస్తున్నాడు. అయితే ఇప్పుడీ కంపెనీ వార్తల్లో నిలిచింది. ఈ కంపెనీలో పనిచేసే ఓ మహిళ విశాల్‌ను రూ. 45 లక్షలకు మోసం చేసిందనే వార్త తాజాగా మీడియాలో హైలెట్ అయింది. దీనిపై విశాల్ మేనేజర్ హరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అయితే ఆ మహిళ మాత్రం తాను ఎవరిని మోసం చెయ్యలేదని.. విశాల్‌పై ఎదురుదాడికి దిగింది. విశాల్ పైకి కనిపించినంత మంచివాడు కాదని.. పైకి హీరోగా కనిపించినా లోపల అతనొక పెద్ద విలన్ లా ఉంటారని ఆరోపించారు. అంతేకాదు తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని.. ఏ తప్పు చేయలేదని.. ఆఫీస్‌లో తన ముందే ఎన్నో విషయాలు జరిగాయి. అవన్నీ చెబితే.. విశాల్ అసలు బండారం బయటపడుతుందని వ్యాఖ్యానించింది. తాను మహిళను అవ్వడం వల్లే ఇంతవరకూ సైలెంట్‌గా ఉండాల్సి వచ్చిందని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com