హైకోర్టును తాకిన కరోనా.. కోర్టు మూసివేత

హైకోర్టును తాకిన కరోనా.. కోర్టు మూసివేత

మహమ్మారి కరోనా వైరస్ హైకోర్టులో పని చేస్తున్న 25 మంది ఉద్యోగులకు సోకింది. దీంతో రేపటి నుంచి హైకోర్టు మూసి వేయాలని నిర్ణయం తీసుకున్నారు అధికారులు. హైకోర్టును పూర్తిగా శానిటైజ్ చేయాలని సిబ్బందిని ఆదేశించారు న్యాయమూర్తులు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైకోర్టు అత్యవసర కేసులను విచారిస్తోంది. ఈ నెల 7వ తేదీన హైకోర్టులో పనిచేస్తున్న ఉద్యోగులు 50 మందికి పరీక్షలు నిర్వహించగా అందులో 25 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో కోర్టులోని ఫైల్స్ అన్నింటినీ జ్యూడీషియల్ అకాడమీకి తరలించనున్నారు. అయితే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపే కేసుల విషయంలో ఎలాంటి మార్పు ఉండదని హైకోర్టు స్పష్టం చేసింది.

Tags

Read MoreRead Less
Next Story