కరోనా వ్యాప్తిపై పరిశోధనలు : ఆందోళనకర అంచనాలు

కరోనా వ్యాప్తిపై పరిశోధనలు : ఆందోళనకర అంచనాలు

భారత్ లో రానున్న కాలంలో కరోనా వ్యాప్తిపై జరుగుతున్న పరిశోధనలలో ఆందోళనకర అంచనాలు బయటపడుతున్నాయి. కరోన వ్యాక్సిన్ రాని యడల వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి భారత్ లో రోజుకు 2,87,000 కరోనా కేసులు నమోదవుతాయని అమెరికాకు చెందిన మాసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు తెలిపారు. ఈ పరిశోధన జరిపిన పరిశోధకులు అంటు వ్యాధుల వ్యాప్తిని గణించే.. అనుమానిత, రిస్క్‌, వైరస్‌, రికవరీ పద్దతిలో విశ్లేషించారు. వ్యాక్సిన్ అందుబాటులో లేకపోతే.. 2021 మే నాటికి 25 కోట్ల కరోనా కేసులు నమోదవుతాయని అన్నారు.

2021 ఫిబ్రవరి నాటికి భారత్ లో ఎక్కువ కేసులు నమోదవుతాయని.. ఒక్కరోజుకు 2,87,000 కేసులు, అమెరికాలో 95,000 కేసులు, దక్షిణాఫ్రికాలో 21,000 కేసులు, ఇరాన్ లో 17,000 కేసులు నమోదవుతాయని ఈ పరిశోధనలలో తేలింది. కరోనా టెస్టులు ప్రస్తుతం జరుగుతున్న స్థాయిలో జరిగి.. కాంటాక్ట్ రేటింగ్ కూడా ఇలాగే ఉంటే.. కేసుల సంఖ్య, మరణాల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని తెలిపింది. ప్రస్తుతం ప్రతీ దేశంలో వైరస్ వ్యాప్తి, కాంటాక్ట్ రేటింగ్, టెస్టింగ్ తీరుతెన్నులు, రికవరీ రేటు.. వీటి ఆధారంగా ఈ పరిశోధన జరిగింది.

Tags

Read MoreRead Less
Next Story