రూ. 300 కోట్ల విలువైన నీరవ్ మోదీ ఆస్తుల జప్తు

రూ. 300 కోట్ల విలువైన నీరవ్ మోదీ ఆస్తుల జప్తు

పంజాబ్ నేషనల్ బ్యాంక్ కు వేలకోట్ల రూపాయలు ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీకి ఈడీ షాక్ ఇచ్చింది. ఫ్యుజిటివ్ ఎకనామిక్ నేరాల చట్టం కింద 300 కోట్లకు పైగా విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఇందులో అలీబాగ్‌లోని భూమి, జైసల్మేర్‌లోని విండ్‌మిల్లులు, సముద్రీ మహల్ లో నాలుగు ఫ్లాట్లు, ముంబైలో ఐకానిక్ భవనం, సి-సైడ్ ఫామ్‌హౌస్, లండన్‌లోని ఫ్లాట్లు, యుఎఇలోని రెసిడెన్షియల్ ఫ్లాట్లు, షేర్లు , బ్యాంక్ డిపాజిట్లు కూడా ఉన్నాయి. కాగా ఈ ఏడాది మార్చి లో నిర్వహించిన వేలంలో ఖరీదైన గడియారాలు, పర్సులు, ఖరీదైన కార్లు, పెయింటింగ్‌లు, హ్యాండ్‌బ్యాగులు వంటి వాటిని వేలం వేశారు. అంతేకాదు సుమారు 51 కోట్ల మిల్లులను కూడా ఈడీ వేలం వేసింది.

Tags

Read MoreRead Less
Next Story