ఆయాసం వస్తోందా.. అయితే అది కచ్చితంగా..

ఆయాసం వస్తోందా.. అయితే అది కచ్చితంగా..

ఆయాసం, జ్వరం, దగ్గు, మోషన్స్ ఇందులో ఏది వచ్చినా కొవిడ్ అయి ఉంటుందని అనుమానం.. అసలు ఏ లక్షణాలు లేకుండా కూడా ఒక్కోసారి పాజిటివ్ చూపిస్తుంది. ఈ లక్షణాలు ఉంటే కరోనానే అని చెప్పడానికి లేకుండా పోతోంది. కరోనాకి తోడు వర్షాకాలం సీజనల్ వ్యాధులు కూడా దరి చేరడంతో ప్రజల్లో ఆందోళన మరింత ఎక్కువవుతోంది. వైరస్ గురించి చాలా మందికి అవగాహన వచ్చినా అక్కడక్కడా ఇంకా నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు.

ప్రతి ఒక్కరూ మాస్క్ కచ్చితంగా ధరించాలి. అత్యవసరమైతేనే తప్ప బయటకు వెళ్లకూడదు. సాధారణంగా యువత, మధ్య వయస్కుల ద్వారానే వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతుంది. ముఖ్యంగా యువతలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి లక్షణాలు బయటపడేందుకు చాలా సమయం పడుతుంది. ఈలోగా వారి ద్వారా వైరస్ ఇతరులకు వ్యాపించే అవకాశం ఉంది.

వైరస్ లక్షణాలు ఉంటే మీరు జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతానికి వెళ్లారా.. మీ ఏరియాలో ఎవరికైనా వచ్చిందా.. వంటి విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ కేసులు జ్వరం, గొంతునొప్పి, దగ్గు, ఆయాసం వంటి లక్షణాలతోనే వస్తున్నాయి. అతి కొద్ది మందికి మాత్రమే మరికొన్ని లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి. ఇవేవీ లేకుండా ఒక్క ఆయాసమే వచ్చినా అనుమానించాల్సిందే. వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. కరోనా రోగుల్లో చాలా మందికి ఆయాసం ప్రధమ లక్షణంగా కనబడుతుంది. ఇలాంటి వారు వెంటనే ఆస్పత్రిలో చేరడం మంచిది.

ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్యకరమైన అలవాట్లు పెంపొందించుకోవడం మంచిది. పోషకారం తీసుకోవడం, గోరు వెచ్చని నీళ్లు తాగడం, ఉప్పు నీటితో గార్గిలింగ్ చేయడం, చేతులు తరచూ శుభ్రం చేసుకోవడం, సామాజిక దూరం పాటించడం, రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు, రెస్టారెంట్లకు వెళ్లకపోవడమే మంచిది. మాస్క్ ధరించని వ్యక్తులకు దూరంగా ఉండాలి. ఇంట్లో ఎవరికైనా సాధారణ జ్వరం ఉన్నా తగ్గే వరకు వారిని ఒంటరిగా ఉంచడం మంచిది అని వైద్యులు వివరిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story