ప్రభుత్వ , ప్రైవేటు ఆస్పత్రుల్లో బెడ్ల వివరాలు తెలుసుకునేందుకు కొత్త యాప్

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో అన్ని ఆసుపత్రులు రోగులతో నిండిపోతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అయితే బెడ్ల కొరత తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో Synk app సంస్థ సరికొత్త యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ యాప్ ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎన్ని బెడ్లు ఉన్నాయో తెలుసుకోవచ్చని ఈ సంస్థ ప్రతినిధులు అంటున్నారు. ఆన్ లైన్ ద్వారా బెడ్ల పరిస్థితి ఐసీయూల వివరాలు తెలుస్తాయని అంటున్నారు. త్వరలో ఆరు రాష్ట్రాల్లో ఈ యాప్ అందుబాటులోకి రానుందని ఒక్కో రాష్ట్రానికి ఒక్కో అప్లికేషన్ ఇస్తామని అన్నారు. దీని ద్వారా ఎంతమంది రోగులు రికవరీ అయ్యారో కూడా తెలుస్తుందని ప్రభుత్వం అంగీకరిస్తే పూర్తి వివరాలు నివేదిస్తామని Synk app ప్రతిధులు అంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story