హైదరాబాద్ - విజయవాడ హైవే మీదుగా భారీగా గంజాయి స్మగ్లింగ్

హైదరాబాద్ - విజయవాడ హైవే మీదుగా భారీగా గంజాయి స్మగ్లింగ్

గంజాయి అక్రమరవాణా యథేచ్ఛగా సాగుతోంది. ఏకంగా రాష్ట్రాల సరిహద్దులు కూడా దాటించి సరుకు సప్లై చేస్తున్నారు. హైవేలపై కాకీల కళ్లుగప్పి ఎలా దీన్ని తరలించగలుగుతున్నారు. చెక్ పోస్టుల వద్ద నిఘాను ఎలా తప్పించుకుంటున్నారు. ఇదే ఇప్పుడు అంతుచిక్కడం లేదు. మెట్రో సిటీ హైదరాబాద్ లో హైఫై పార్టీ జరుగుతుందంటే డ్రగ్స్ కూడా ఉన్నట్టే లెక్క కొకైన్ , హెరాయిన్, lsd , ఏదైనా సరే ఈజీగా దొరికేది. ఇక వరుసగా స్పెషల్ ఆపరేషన్ తో డ్రగ్ పెడ్లర్లపై ఉక్కుపాదం మోపిన పోలీసులు దాదాపుగా మాదక ద్రవ్యాల ముఠాల ఆట కట్టించారు. ఈ నేపథ్యంలో మత్తుకు అలవాటు పడిన వారు ఆ వ్యసనాన్ని వదులుకోలేక ప్రత్యామ్న్యాయాలకోసం అన్వేషిస్తున్నారు. ఇదే ఇప్పుడు గంజాయికి విపరీతమైన డిమాండ్ పెరిగేలా చేసింది. నిజానికి తెలంగాణ జిల్లాల్లో గంజాయి

సాగు చాలా తక్కువే ఆంధ్రతో సరిహద్దులో ఉన్న ఖమ్మం జిల్లాలోని కొన్ని ప్రాంతాలు వైజాగ్ లాంటి ప్రాంతాల నుంచి యథేచ్ఛగా హైదరాబాద్ కు గంజాయి రవాణా కొనసాగుతోంది. చాలా సందర్భాల్లో

హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి మీదుగానే గంజాయి స్మగ్లింగ్ గుట్టుగా సాగిస్తున్నారు. లాక్ దేవన్ నిబంధనలు ఎత్తివేసిన తరువాత nh65 పై గంజాయి పట్టుబడటం పోలీస్ ఉన్నతాధికారులను విస్మయానికి గురిచేసింది. వీటిలో పోలీసులు రెడ్హ్యాండెడ్ గా పట్టుకుంది కొంతమాత్రమే.. దళారులు కొనుగోలు చేసిన గంజాయిని హైదరాబాద్ తో పాటు సూర్యాపేట , కోదాడ , మిర్యాలగూడ, దేవరకొండ , భువనగిరిలలో విక్రయిస్తున్నారు. ఇటీవల ఈ ప్రాంతంలో కొందరు వ్యక్తులు పట్టుబడినా అసలు మూలాలు ఎక్కడద్దని అంతుబట్టలేదు. తెలంగాణ , ఏపీ సరిహద్దులోని కోదాడ దగ్గర గంజాయి అమ్ముతూ నలుగురు యువకులు పట్టుబడ్డారు. అలాగే తూర్పు గోదావరి, ఖమ్మం జిల్లాలనుంచి వీరిది సప్లై అవుతోంది.

Tags

Read MoreRead Less
Next Story