కంటైన్మెంట్ జోన్లో తిరుమల.. శ్రీవారి దర్శనం..

కంటైన్మెంట్ జోన్లో తిరుమల.. శ్రీవారి దర్శనం..

పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలను కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు. కేసులు పెరుగుతున్న తరుణంలో జిల్లా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. మహమ్మారి కారణంగా మార్చి 20 నుంచి శ్రీవారి దర్శనాలకు అనుమతివ్వలేదు. లాక్ డౌన్ నిబంధనలు సడలించిన అనంతరం తిరిగి దర్శనానికి అనుమతిచ్చారు దేవాలయ అధికారులు. కొవిడ్ నియంత్రణ చర్యలు పక్కాగా అమలు చేస్తూ భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. మొదట్లో రోజుకు 6వేల మంది భక్తులకు మాత్రమే స్వామి వారి దర్శనం కల్పించినా, ప్రస్తుతం 12 వేల మంది భక్తులు తిరుమలకు తరలి వెళుతున్నారు. తిరుమల కంటైన్ మెంట్ జోన్లో ఉన్నా ఆలయం తెరిచే ఉంటుందని అధికారులు తెలియజేశారు.

Tags

Read MoreRead Less
Next Story