ప్లాస్టిక్ వ్యర్ధాలతో రోడ్లు.. కోట్ల రూపాయల ఆదా..

ప్లాస్టిక్ వ్యర్ధాలతో రోడ్లు.. కోట్ల రూపాయల ఆదా..

పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ వ్యర్ధాలతో కేంద్ర ప్రభుత్వం లక్ష కిలోమీటర్ల రోడ్డును పూర్తి చేసింది. రీసైక్లింగ్ చేయడానికి వీలుపడని ప్లాస్టిక్ ని ఇందులో వినియోగించింది. ఫలితంగా కొన్ని వందల కోట్ల రూపాయలను ఆదా చేయగలిగింది. ఇది సక్సెస్ కావడంతో మరో లక్ష కిలోమీటర్ల మేర ప్లాస్టిక్ రోడ్లు వేయాలని నిర్ణయించుకుంది. ప్లాస్టిక్ రోడ్డు వేయడానికి ఒక కిలోమీటరుకు తొమ్మిది టన్నుల తారు, ఒక టన్ను ప్లాస్టిక్ వ్యర్ధాలు వాడారు. సాధారణ రోడ్లకైతే కిలోమీటరుకు పది టన్నుల తారును వాడతారు. ఒక టన్ను తారుకు 30 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. కిలో మీటరుకు ఒక టన్ను ప్లాస్టిక్ వ్యర్ధాలను ఉపయోగించడం వల్ల, లక్ష కిలోమీటర్లకు వందల కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి. ప్లాస్టిక్ రోడ్డలో సహజంగా ఆరు నుంచి ఎనిమిది శాతం ప్లాస్టిక్ 92 నుంచి 94 శాతం తారు ఉంటాయి. ప్లాస్టిక్ రోడ్డును తొలిసారిగా 2018లో గురుగ్రామ్ లో వేశారు. ఆ తరువాత జమ్మూకాశ్మీర్ లో 270 కిలోమీటర్ల మేర ప్లాస్టిక్ రహదారి వేయడం జరిగింది. కాగా, భారత్ లో రోజుకు 25,940 టన్నుల ప్లాస్టిక్ వ్యర్ధాలు తయారవుతున్నాయి. ఇందులో 60 శాతంపైగా రీసైక్లింగ్ అవుతోంది. మిగిలిన 40 శాతంతో వాతావరణం కాలుష్యం అవుతోంది.

Tags

Read MoreRead Less
Next Story