వైఎస్ఆర్‌సీపీ గుర్తింపు రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. అన్నా వైఎస్ఆర్ పార్టీ అధినేత బాషా ఈ పిటిషన్ దాఖలు చేసినట్టు సమాచారం. ఈ పిటిషన్ త్వరలో విచారణకు వచ్చే అవకాశం ఉంది. తమ పార్టీ పేరును అధికారికంగా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వాడుకుంటోందని ఇప్పటికే ఎన్నికల సంఘానికి కూడా అన్నా వైఎస్ఆర్ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు.

కాగా నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు లేవనెత్తిన లాజికల్ పాయింట్ కు వైకాపా నేతలు సమాధానం చెప్పలేకపోయారు. ఎంపీ రఘురామకృష్ణం రాజుకు పార్టీ నేత విజయసాయిరెడ్డి పంపిన షోకాజ్ నోటీస్ పై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే.

Recommended For You