ప్రపంచవ్యాప్తంగా కరోనా కలకలం.. మొత్తం కోటి 30 లక్షల కేసులు

ప్రపంచవ్యాప్తంగా కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటివరకూ కోటి 30 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. అటు మృతుల సంఖ్య కూడా భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,30,36,587కి చేరింది. ఇప్పటివరకూ 5,71,574 మంది కరోనాతో మృతి చెందారు. కరోనా నుంచి 75,82,426 మంది కోలుకున్నారు. ఈ మహమ్మారి ప్రభావం ఆరోగ్యంపైనే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్రంగా పడింది. దీంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. అటు, అమెరికాలో ఈ మహమ్మారి కల్లోలం సృష్టిస్తుంది. ఇప్పటివరకూ 34,13,995 పాజిటీవ్ కేసులు నమోదవ్వగా.. 1,37,782 మంది మృతి చెందారు. 15,17,084 మంది కోలుకున్నారు.

మరోవైపు భారత్ లో కూడా కరోనా విజ‌ృంభణ కొనసాగుతుంది. దేశంలో మొత్తం కరోనా కేసులు 8,78,254కి చేరాయి. అందులో 3,01,609 మంది చికిత్స పొందుతుండగా.. 5,53,471 మంది కోలుకున్నారు.

Recommended For You