ఎంసెట్ స‌హా ప్ర‌వేశ ప‌రీక్ష‌లు వాయిదా

ఏపీలో ఎంసెట్ స‌హా అన్ని ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌లు వాయిదా పడ్డాయి. ఈ విషయాన్నీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలియజేశారు. క‌రోనా మ‌హ‌మ్మారి ప్రబ‌‌ళుతున్న స‌మ‌యంలో ప్రవేశ పరీక్షలు నిర్వహించడం సాధ్యం కానందున.. అలాగే జాతీయ ఎంట్రన్స్ పరీక్షలకు ఆటంకం కలగ‌కూడ‌ద‌నే వాయిదా వేసినట్టు స్పష్టం చేశారు. సెప్టెంబ‌ర్ మూడో వారంలో ఎంసెట్ నిర్వ‌హిస్తామ‌ని, దీనికి సంబంధించిన ప‌రీక్షా తేదీల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని పేర్కొన్నారు. పరీక్షలకు సంబంధించిన అన్ని అంశాలపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని మంత్రి సురేష్ తెలిపారు.

Recommended For You