జోరుగా కరోనా కేసులపై బెట్టింగులు

కర్నాటకలో ఆశ్చర్యకర విషయాలు బయటకు వస్తున్నాయి. కరోనా కేసులుపై పెద్ద ఎత్తున బెట్టింగు జరుగుతున్నట్టు తెలుస్తుంది. దీంతో పెద్దగా డబ్బులు చేతులు మారుతున్నాయని అంటున్నారు. కరోనా హెల్త్ బులిటెన్ విడుదలవ్వడానికి ముందు ఈరోజు ఎన్ని కేసులు వస్తాయి? ఏ ఏరియాలో కేసులు వస్తాయనే దానిపై బెట్టింగులు జరుగుతున్నట్టు తెలుస్తుంది. హెల్త్ బులిటెన్ విడుదలైన తరువాత డబ్బులు చేతులు మారుతున్నాయి. మైసూర్, చామరాజనగర్ ప్రాంతాల్లో బెట్టింగులు జోరుగా సాగుతున్నాయని చెబుతున్నారు. ఈ వ్యవహారం అంతా పోలీసులకు తెలిసినా.. వారు చూసి చూడనట్టు వ్యవహారిస్తున్నారని అంటున్నారు.

Recommended For You