తెలంగాణలో కొత్తగా 1,550 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో కరోనా కలకలం సృష్టిస్తోంది. రోజు రోజుకీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో సోమవారం ఒక్కరోజే 1,550 కరోనా కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 926 మందికి పాజిటివ్‌గా తేలినట్టు వైద్యశాఖ బులెటిన్‌లో పేర్కొంది. తాజా కేసులతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 36221కి చేరింది. కరోనా కారణంగా 9మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మరణాల సంఖ్య 365కు పెరిగింది. 23679 మంది కరోనా బారి నుండి కోలుకుని డిశార్జ్ అయ్యారు. 12178 మంది హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.

Recommended For You