ఢిల్లీలో కొత్తగా కేసులకంటే రికవరీలు ఎక్కువ

ఢిల్లీలో కొత్తగా 1,246 కోవిడ్ -19 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి, 1344 మంది సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. అలాగే సోమవారం మరో 40 మంది కరోనా భారిన పడి మరణించారు. దీంతో దేశ రాజధానిలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,13,740 కు పెరిగింది, ఇందులో 91,312 కోలుకున్నారు. 3,411 మరణాలు ఉన్నాయి. సోమవారం దేశ రాజధానిలో నిర్వహించిన 12,171 కోవిడ్ -19 పరీక్షలు చేయగా.. ఇందులో 3860 ఆర్‌టిపిసిఆర్ / సిబిఎనాట్ / ట్రూ నాట్ పరీక్షలు చేస్తే.. 8311 రాపిడ్ యాంటిజెన్ పరీక్షలు చేశారు.

Recommended For You