అమ్మ ఫోన్ తీసుకుని ఆన్‌లైన్ లో గేమ్.. అకౌంట్ లో రూ.5లక్షల 40 వేలు హాంఫట్..

అమ్మ ఫోన్ తీసుకుని ఆన్‌లైన్ లో గేమ్.. అకౌంట్ లో రూ.5లక్షల 40 వేలు హాంఫట్..

అమ్మా ఒకసారి ఫోన్ ఇవ్వు అని అరిచి గీపెడితే ఇవ్వక ఏం చేస్తాం.. అది కాస్తా ఇంత కొంప ముంచుతుందని ఎవరూ ఊహించరు. నాన్న కువైట్ వెళ్లి నాలుగు డబ్బులు సంపాదిస్తే పిల్లాడిని బాగా చదివించొచ్చు అనుకున్నాడు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం పట్టణానికి చెందిన ఓ బాలుడు తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు. ఇరవై రోజుల నుంచి అమ్మ ఫోన్ తీసుకుని ఆన్‌లైన్ లో గేమ్ ఆడుతున్నాడు. ఈ క్రమంలో ఫ్రీ ఫైర్ అనే ఆన్లైన్ గేమ్ యాప్ ను ఓపెన్ చేసాడు బాలుడు. గేమ్ లో భాగంగా కొత్త వెపన్స్ కొనాలంటే లింక్ ఓపెన్ చేయాలని ఓ ఆప్షన్ వచ్చింది.

అప్పటికే గేమ్ లో నిమగ్నమైన బాలుడు ఆ లింకును ఓపెన్ చేశాడు. అందులో వంద నుంచి వెయ్యి రూపాయల వరకు వెపన్స్ ధరలున్నాయి. ఇక వాటిని కొనుగోలు చేయాలనుకుని ఓటీపీ కూడా ఎంటర్ చేశాడు. ఇలా వెయ్యి నుంచి పదివేల వరకు ఆయుధాలు కొనుగోలు చేస్తూ వెళ్లాడు. ఇరవై రోజుల వ్యవధిలో రూ.5.40 లక్షల నగదు ఖాతా నుంచి ఖాళీ అయిపోయింది. చివరకు విషయం తెలుసుకుని గల్ఫ్ లో ఉన్న తండ్రి షాకయ్యాడు. ఏటీఎంకు వెళ్లిన తల్లికి అకౌంట్ లో డబ్బులు ఖాళీ అయిన విషయం తెలుసుకుని భోరుమంది. భర్త కువైట్ వెళ్లి సంపాదించిన కష్టమంతా ఇలా ఆవిరి అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Tags

Read MoreRead Less
Next Story