విశాఖలో భారీ అగ్నిప్రమాదం

విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ ఘటన మరువకముందే మరో ప్రమాదం చోటు చేసుకుంది. పరవాడలోని ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రాంకీ సాల్వెంట్స్ ఫార్మాలో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. 17 సార్లు పేలుడు శబ్దాలు వినిపించాయని సమాచారం. దాంతో పరిశ్రమలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. పొగలో 65 మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది.

స్థానికులు ఇచ్చిన సమాచారంతో అగ్నిమాపక శాఖ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ.. మంటల తీవ్రత అధికంగా ఉండటంతో మంటల్ని అదుపు చేయడం వారికి కష్టంగా మారింది. అయినా మంటలను అదుపులోనికి తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. కాగా ఫార్మాసిటీలోని వేర్వేరు కంపెనీల్లో మందులు తయారుచేసే క్రమంలో వచ్చే ఓ రకమైన వృథా ఆయిల్‌ను తిరిగి శుభ్రపరిచే ప్రక్రియ ఈ సాల్వెంట్స్‌ కంపెనీలో జరుగుతుంది.

Recommended For You