ఏపీలో మూడు రోజులపాటు విస్తారంగా వర్షాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసిమ జిల్లాలో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. అక్కడక్కడా భారీ వర్షాలు కూడా కురుస్తాయని పేర్కొంది. కాగా సోమవారం ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం, రాయలసీమ, దక్షిణ కోస్తా ఆంధ్ర జిల్లాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి.

Recommended For You